సాగరం గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రతిభ పరీక్ష

సాగరం గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రతిభ పరీక్ష

NLR: అనంతసాగరం గ్రంథాలయంలో శనివారం వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు పచ్చదనం-పర్యావరణంపై ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గ్రంథాలయ పాలకుడు నారాయణరావు, సచివాలయ అధికారి మురళి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.