మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నినాదాలు

మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నినాదాలు

నల్గొండ రింగ్ రోడ్ నిర్మాణంపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. BJP నేతలు మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు రింగ్ రోడ్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అవసరమైన అనుమతులు లేకుండానే మట్టితవ్వకాలు చేపడుతున్నారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.