పారిశుద్ధ కార్మికులకు స్వెటర్లను పంపిణీ చేసిన ఛైర్మన్
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం స్టేషన్, దన్నసరి, సబ్ స్టేషన్ తండా, అమీన్‌పురం గ్రామానికి చెందిన 85 మంది పారిశుద్ధ కార్మికులకు ఇవాళ స్వెటర్లు, జాకెట్లు పంపిణీ చేశారు. వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.