గ్రంథాలయానికి కంప్యూటర్‌లు, టీవీ వితరణ

PPM: పాలకొండ శాఖా గ్రంథాలయానికి ఓ ఫౌండేషన్ 2 కంప్యూటర్లు, 1 స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ విరాళంగా అందించింది. ఇన్‌ఛార్జ్ లైబ్రేరియన్ బబ్బురు గణేశ్ బాబుకు, ఫౌండేషన్ ట్రైనర్ వళ్లిదేవి ఆదివారం అందజేశారు. గ్రంథాలయాన్ని యువతకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొండ పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని వినియోగించవచ్చన్నారు.