పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్

ములుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డబ్బు, అక్రమ మద్యం, నిషేధిత వస్తువులు తరలిస్తున్నారన్న అనుమానంతో తనిఖీలను ముమ్మరం చేశారు. వాజేడు మండలంలోని కొంగాల క్రాస్ వద్ద స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి, వివరాలను సేకరించారు.