కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

WGL: జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద దేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న సదుపాయాలు గురించి విద్యార్దులని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.