నూతన ఎస్సైగా కేటీ మల్లేశ్ బాధ్యతలు

నూతన ఎస్సైగా కేటీ మల్లేశ్ బాధ్యతలు

GDWL: అయిజ మండల పీఎస్ నూతన ఎస్సైగా కేటీ మల్లేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. మద్యం, మాదకద్రవ్యాలు, ఇసుక అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని చెప్పారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.