VIDEO: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

VZM: భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి విమానాశ్రయాన్ని తీసుకువెళుతున్నామన్న ఆందోళన ఎవరికి అవసరం లేదని తెలిపారు. మునపటి కంటే వేగంగానే భోగాపురం చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికోసం ఏడు పాయింట్లు ఎంచుకున్నామని వెల్లడించారు. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తామని పేర్కొన్నారు.