కుకునూరుపల్లి మండలంలో తొలిసారి సర్పంచ్ ఎన్నికలు
SDPT: జిల్లా కుకునూరుపల్లి మండలంలో తొలిసారి సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. మండలంలోని 14 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు,120 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ మండలంలో మొత్తం 15,030 మంది ఓటర్లు ఉండగా, మొత్తం నాలుగు క్లస్టర్లుగా అధికారులు విభజించారు. నాలుగు క్లస్టర్లలో రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.