లిక్కర్ స్కామ్‌పై సుప్రీం విచారణ వాయిదా

లిక్కర్ స్కామ్‌పై సుప్రీం విచారణ వాయిదా

AP: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అనుమానితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే హైకోర్టు విచారణ తర్వాతే విచారిస్తామని సుప్రీం తెలిపింది. ఈ నెల 7న హైకోర్టులో విచారణ ఉన్నందున ఇప్పుడు ఎలాంటి విచారణ చేయలేమని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.