గాయపడిన జర్నలిస్టును పరామర్శించిన డీపీఆర్‌వో
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వీరాంజనేయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వార్తల సేకరణలో వివిధ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జర్నలిస్టులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు.