రేపు అల్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు అల్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

NLR: అల్లూరు MRO కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు MRO లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కావున మండల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు.