నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 9 గంటలకు రామచంద్రపురం రూరల్ మండలం అన్నయ్య పేటలో ఆంజనేయస్వామి గుడిని సందర్శిస్తారు. ఉదయం 10 కు రామచంద్రపురం రూరల్ మండలం వెల్ల గ్రామంలో ఇటీవల మరణించిన టీడీపీ నాయకులు అన్యం జానకి రామయ్య సంతాప సభలో పాల్గొని నివాళులర్పిస్తారు.