భార్య కనబడటం లేదని భర్త ఫిర్యాదు

భార్య కనబడటం లేదని భర్త ఫిర్యాదు

కృష్ణా: భార్య కనబడకపోవడంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు వివరాల ప్రకారం.. రామకృష్ణపురానికి చెందిన వెంకటేశ్వరరావుకు ఆది లక్ష్మి అనే మహిళతో వివాహమైంది. ఈ క్రమంలో వీరివురి మధ్య మంగళవారం సాయంత్రం వివాదం చోటు చేసుకుంది. మనస్థాపానికి గురైన ఆదిలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.