వరిలో 'బెరుకు'ల బెడద.. రైతుల ఆవేదన
KMM: వరి సాగులో బెరుకుల సమస్య అన్నదాతలను కలవరపెడుతోంది. విత్తనాల కల్తీ వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బెరుకులు పంట కంటే వేగంగా, ఎత్తుగా పెరిగి గాలి, వెలుతురు సోకకుండా అడ్డుకుంటున్నాయని.. ఫలితంగా దిగుబడి తగ్గుతోందని వాపోతున్నారు. అధికారులు సూచించిన జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదని, నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు.