నగర వాసులకు ముఖ్య గమనిక
HYD: రేపు భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి యాత్ర మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రేపు నగర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.