సూరయ్య బంజర్ తండాలో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా సూరయ్య బంజర్ తండాలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలింగ్ కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్ల మధ్య ఒక్కసారిగా వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, ఏజెంట్లను బయటికి పంపించారు.