అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ
VKB: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియకు, భద్రతా ఏర్పాట్లకు, బందోబస్తుకు సంబంధించి అధికారులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందుగానే నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు.