ప్రతీ ఆటో డ్రైవర్‌కు రూ. 5 లక్షల బీమా.. KTR హామీ
SRCL: సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లందరికీ రూ. 5 లక్షల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం సిరిసిల్ల ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆయన నియోజకవర్గానికి చెందిన 5 వేల మంది ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతంగా తానే ప్రమాద బీమా చెల్లిస్తానని ప్రకటించారు.