అసెంబ్లీ నిరవధిక వాయిదా

అసెంబ్లీ నిరవధిక వాయిదా

TG: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిశాయి. సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ వ్యయానికి సంబంధించిన 'ద్రవ్య వినిమయ బిల్లు'ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసంఘటిత రంగ కార్మికులు, న్యాయవాదుల రక్షణ వంటి ముఖ్యమైన చట్టాలు ఈ సమావేశాల్లో రూపుదిద్దుకున్నాయి.