వికారాబాద్‌లో నిలిచిన బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు

వికారాబాద్‌లో నిలిచిన బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు

VKB: వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చర్చలు విఫలమవడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ విలీనం, ఎన్నికల నిర్వహణ వంటి డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.