కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS నాయకులు

NGKL: అచ్చంపేట మండలం కొర్రతండాకి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.