నగరంలో మూడు రోజులు నీటి సరఫరా బంద్

నగరంలో మూడు రోజులు నీటి సరఫరా బంద్

GNTR: నగరంలోని కొన్ని ప్రాంతాలకు 3 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. నగరపాలక సంస్థ పరిధిలోని సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద 900 ఏంఏం డయా ఇంటర్ కనెక్షన్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నందున ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో ఈ అంతరాయం ఉంటుందని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీ, KVP కాలనీ, శ్యామలనగర్‌లలో నీటి సరఫరా ఉండదన్నారు.