సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్
SRD: సంగారెడ్డి కలెక్టరేట్‌లో గృహ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల లభ్యతపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. కృత్రిమ కొరతపై నిఘా ఉంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.