సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

NZB :సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం వినాయకనగర్‌లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకల అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.