భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
WGL: పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారికి గురువారం మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు శేషు అమ్మవారిని విశేష అలంకరణతో ముస్తాబు చేసి, కుంకుమార్చన, లక్ష పత్రి పూజలు నిర్వహించి మహా హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.