రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ట్రామా నెట్వర్క్: MP
ఏలూరు జిల్లా ఆసుపత్రి సహా 14 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్లు నడుస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతాప్ జాదవ్ తెలిపినట్లు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా 196 ట్రామా కేర్ సౌకర్యాలు మంజూరు అయ్యాయని అలాగే ఏపీలో రూ.92 కోట్లు ఖర్చుతో 14 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారన్నారు