కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం

కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం

TPT: రేణిగుంట మండలం తూకివాకం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 45-50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం నీటిలో కుళ్లిన స్థితిలో గట్టు వద్ద కనిపించింది. కుడి చేతిపై "చిత్ర" అనే టాటూ ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.