ఈ నెలాఖరులో 'సింగూరు'కు మరమ్మతులు

ఈ నెలాఖరులో 'సింగూరు'కు మరమ్మతులు

HYD: మహా నగరానికి తాగునీటిని అందజేస్తున్న సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతు పనులను ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై నిర్ణయించారు. డ్యామ్‌లో సామర్థ్యం కన్నా ఎక్కువ నీటిని నిల్వ ఉంచడం వల్ల ఆనకట్ట దెబ్బతినింది. సింగూరు సామర్థ్యం 517.8మీటర్లు అయితే నీటిని 522 మీటర్ల వరకు నిల్వ చేశారు.