అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

KNR: రామడుగు మండలం మోతె గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోతె వాసి బత్తిని తిరుపతి (42) కొద్ది నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇటీవల అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ గురువారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.