పాఠశాల రుణం తీర్చుకున్న ఉపాధ్యాయుడు
SKLM: సంతబొమ్మాళి(M) లక్ష్మీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి, 2025 డీఎస్సీ ఉపాధ్యాయుడు తంగి గోవిందరావు శుక్రవారం రూ.25 వేలు విలువ గల టీవీ బహుకరించారు. దీని ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే బోధనాంశాలు అధునాతన పద్ధతిలో డిజిటల్ పద్ధతిలో వివరించవచ్చని ఆయన అన్నారు. ఆయనను ఉపాధ్యాయులు అభినందించారు.