గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ

W.G: పెదపాడు మండలం వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఎంపీ మహేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన తరగతి గదులు, భోజనశాల, వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల మెనూ వివరాలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను పరిశుభ్రంగా, ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న వార్డెన్, సిబ్బందిని ఆయన అభినందించారు.