రాములగుట్ట తండా సర్పంచి స్థానం ఏకగ్రీవం
KMR: నస్రుల్లాబాద్ మండలం రాములగుట్ట తండా గ్రామ పంచాయతీ సర్పంచి స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. గ్రామస్థులంతా కలిసి కేతవత్ లలితను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆదివారం తీర్మానించారు. ఏకగ్రీవంగా తీర్మానించినందుకు లలిత కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.