రోడ్డుపై గుంతను పూడ్పించిన సీఐ

రోడ్డుపై గుంతను పూడ్పించిన సీఐ

KDP: మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఏర్పడిన పెద్ద గుంతపై సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారానికి సీఐ రమణారెడ్డి స్పందించారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించి బుధవారం ఆయన జేసీబీతో ఆ గుంతను పూడ్చి చదును చేయించారు. దీంతో స్థానికులు సీఐని అభినందించారు.