అద్దంకిలో టీ తాగిన మంత్రి

BPT: అద్దంకి పట్టణం భవాని సెంటర్‌లో స్థానిక టీ స్టాల్ నందు శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సరదాగా టీ తాగుతూ ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అమలుపై మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు.