నేడు ఆ గ్రామాలకు పవర్ కట్..!

GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల పనుల జరుగుతున్నాయి. ఈ కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ నీలి గోవిందు, ఇన్‌ఛార్జ్ ఏఈ చిన్నయ్య తెలిపారు. ఈ పవర్ కట్ సీటిపాడు, కేశవరం, వేణిసోంపురం, తుప్పత్రాల గ్రామాలకు వర్తిస్తుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.