15 హామీలతో అభ్యర్థి బాండ్ పేపర్
MDK: హవేలి ఘనపూర్ మండలం రాజుపేట్ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక 15 హామీలతో బాండ్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. 6 నెలలలోపు కొత్త ట్రాలీ కొని చెత్తసేకరణ, వృద్ధులకు ఇంటివద్దకే పింఛన్ పంపిణీ, రోజు మంచినీటి సరఫరా, కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రూ.లక్ష లోన్ మంజూరు, గిరిజనుల తీజ్ పండుగకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.