లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

VZM: జామి మండలం అలమండ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి కంటైనర్‌తో ఉన్న లారీ అదుపు తప్పి మెయిన్ రోడ్డు మీద బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎవరికి ఎటువంటి గాయలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ రహదారికి అడ్డంగా బోల్తా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. JCB సహాయంతో లారీని పక్కకు లాగడంతో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.