VIDEO: మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించిన క్రైస్తవులు
CTR: పుంగనూరులో మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని నాగపాళ్యంలో గల CSIH చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయాన్నే ఈతమట్టలు చేతపట్టి హోసన్న గీతం పాడుతూ చర్చి చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం చర్చ్ పాస్టర్ రాకేశ్ నిమ్రోద్ ప్రసంగించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగ, ఆయన అనుభవించిన శ్రమదినాల గురించి వివరించారు.