కోతకు గురైన సముద్రతీరం

కోతకు గురైన సముద్రతీరం

ప్రకాశం: సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం సముద్రతీరం కోతకు గురైంది. 50M మేర సముద్రం ముందుకు వచ్చింది. గత రెండు నెలల నుంచి సముద్రతీరం కోతకు గురవుతూనే ఉందని స్థానికులు తెలిపారు. సముద్రతీరానికి 50M దూరంలోనే సిమెంటు రోడ్డును నిర్మించారు. దీంతోనే తీరం కోతకు గురవుతుందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.