కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) తన ఇంట్లో కూలర్ మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.