భారతదేశంలో అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జ్

VSP: విశాఖపట్నంలోని కైలాసగిరిలో రూ.6 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపొడవైన 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. పాత టైటానిక్ వ్యూ పాయింట్ స్థానంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ఒకేసారి 40 మందిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రాజెక్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయి. జూలై చివరలో ఈ బ్రిడ్జ్‌ను ప్రజల వినియోగానికి అందించనున్నారు.