ఫ్లెక్సీలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు
GNTR: తెనాలిలో మున్సిపల్ అధికారులు బుధవారం ఫ్లెక్సీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన రహదారుల వైపు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను తొలగించారు. కార్యక్రమం అనంతరం తొలగించకపోతే వాటి వల్ల జరిగే అనర్థాలకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నిర్వాహకులే బాధ్యత వహించాలని అధికారులు తెలియజేశారు.