సాంప్రదాయబద్దంగా వినాయక నిమజ్జనం జరుపుకుందాం: TVVMC

TPT: వినాయక చవితి పండుగ సామూహిక నిమజ్జనం మహోత్సవంలో రికార్డు డ్యాన్సులు, సినిమా పాటలను నిషేధించాలని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వినాయక చవితి ద్వారా హిందువుల ఐక్యతను చాటాలని అశ్లీలమైన నృత్యాలు రికార్డు డ్యాన్సులు వ్యతిరేకించాలన్నారు.