నేడు ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

WGL: కరీమాబాద్, శివనగర్ ప్రాంతాల్లో శుక్రవారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు బల్దియా కాశిబుగ్గ సర్కిల్ ఇంఛార్జ్ ఈఈ సంతోష్ తెలిపారు. అమ్మవారిపేట వెళ్లే ప్రధాన రహదారి వద్ద ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో ఆ పైప్ లైన్ మరమ్మతు పనులు కొనసాగుతున్నందున నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శివనగర్, కరీమాబాద్ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.