ఈ నెల 7 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు

KMR: కామారెడ్డి సర్కిల్‌లో ఈ నెల 7వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు TSNPDCL సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రావణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచుతూ చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంతో టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామన్నారు.