మిస్సింగ్ కేసుపై పోలీసుల నిర్లక్ష్యం..?
HYD: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దేవరయంజాల్ ప్రాంతానికి చెందిన దిడ్డి.కార్తీక్ అనే యువకుడు 15 రోజులుగా కనిపించడం లేదని తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తుందని, యువకుడి లొకేషన్ ట్రేస్ అయినప్పటికీ, పోలీసులు స్పందించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలని కోరారు.