నేడు OUలో 84వ స్నాతకోత్సవం

HYD: ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇవాళ 84వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ. కుమార్ మొలుగరం తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్స్‌లర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డా.నారాయణన్ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గౌరవ డాక్టరేట్‌ను ఇస్రో ఛైర్మన్‌కు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.