VIDEO: వైభవంగా జగన్మోహిని స్వామి కళ్యాణ మహోత్సవాలు

VIDEO: వైభవంగా జగన్మోహిని స్వామి కళ్యాణ మహోత్సవాలు

కోనసీమ: ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి తో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ద్వాదశ ప్రదక్షిణములు, శ్రీ పుష్పోత్సవం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ స్థాయి కూచిపూడి నృత్య కళాకారిణి కుమారి రావి బేబీ సత్యవాణి‌చే కూచిపూడి నృత్య కళా ప్రదర్శన నిర్వహించారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.