సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఉన్న చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువులు వద్ద ఉన్న తూములు సరిగా లేకపోతే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.